మార్జిన్ : - - యామిజాల
 మనమందరం బడికి వెళ్ళినప్పుడు, కొత్త నోట్‌బుక్ కొనగానే చేసే మొదటి పని, ఒక స్కేలు, పెన్సిల్ తీసుకుని అన్ని వైపులా ఒక మార్జిన్ (గీత) గీయడం. కొన్ని నోట్‌బుక్‌లలో అయితే ఓ మార్జిన్ ప్రింటయ్యే ఉంటుంది.
ఇంతకూ, ఆ మార్జిన్ దేనికీ అని అనుకుంటాం. ఏదైనా సంఖ్య రాయడానికో, చక్కగా కనిపించడానికో అనుకుంటాం. కానీ, అది నిజం కాదు!  
ఈ మార్జిన్‌ను కనుగొనడం వెనుక ఒక  చరిత్ర ఉంది! 
పాత రోజుల్లో, అంటే ప్రింటింగ్ ప్రెస్ రాక ముందు, అన్ని ముఖ్యమైన పత్రాలు, కథలు చేతితోనే రాసేవారు.  అలా వ్రాసిన పుస్తకాలను లైబ్రరీలో లేదా ఇంట్లో పేర్చినప్పుడు, అక్కడి ఎలుకలు ఆ పుస్తకాల అంచులను కొరకడం మొదలుపెట్టేవి.
ఎలుకలు అంచులను కొరకడం వల్ల, చేతితో కష్టపడి వ్రాసినవి కనిపించకుండాపోయేవి. అందుకే రచయితలకు ఒక ఉపాయం తట్టింది. వారు కాగితం అంచున కొద్దిగా ఖాళీ వదిలి, దాని లోపల వ్రాయడం ప్రారంభించారు.
ఎలుక కరిస్తే కరుస్తుంది, కానీ అది కేవలం అంచున ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మాత్రమే కరుస్తుందా? ఆ గీతను దాటి కరవదా అనే ప్రశ్న సరేసరి. 
కాలక్రమేణా ఎలుకలు ఒక పెద్ద సమస్యగా మారినప్పటికీ, అంచున ఉండే ఖాళీ ప్రదేశం (మార్జిన్) మనకు అదనపు సమాచారం రాయడానికి, ఉపాధ్యాయుడు తన రిమార్కులు రాయడానికి ఉపయోగకరంగా ఉంటుంది మార్జిన్ పక్కన. ఏమంటారు?

కామెంట్‌లు