అపపటి వరకు కిందా మీదా పడుతూ లేస్తూ అడుగులు వేస్తున్న చిన్ని కృష్ణుడు ఇప్పుడు యశోద చేతులు పట్టుకోకుండా కొన్ని అడుగులు నడుస్తున్నాడు. వేసే ఆ ప్రతి అడుగునూ చూసి యశోద తరిస్తోంది. అయితే అప్పుడప్పుడు అతను తడబడి కిందపడినా, మళ్ళీ లేచి నడవాలన్న అతని కోరిక మాత్రం తగ్గలేదు.
అతని చేతులు పట్టుకోకపోయినా యశోద ఎప్పుడూ వెనకే ఉండేది. అతను ఏ వైపు వెళ్తాడో, దేనికి తగిలి పడిపోతాడో, దేన్ని పట్టుకుని లాగుతాడో అతనికి తెలిసేది కాదు. ఇంట్లోని వస్తువులన్నీ అతనికి ఆటబొమ్మల్లా అనిపించేవి.
అతను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకునే వాడు కాదు.
చెక్క బల్ల ఎక్కడానికి ప్రయత్నిస్తూ, గోడకు వేలాడుతున్న తాడును లాగుతూ, పాల డబ్బాను అందుకోవడానికి ప్రయత్నించేవాడు. అందిన క్షణంలో డబ్బాను తట్టేవాడు ఆనందం పట్టుకోలేక.
కొన్నిసార్లు, వేగంగా నడవాలని అనుకుని, రెండు అడుగులు వేయగానే తూలిపోయి కూర్చుండిపోయేవాడు. తనను ఎవరైనా చూశారేమోనని వెంటనే చుట్టూ చూసేవాడు. గోపికలు నవ్వితే, అతను ముఖం చిట్లించి వారిపై కోపగించుకునేవాడు.
కానీ యశోద మాత్రం నవ్వకుండా, “నా బాడ్డవు కదూ… నెమ్మదిగా నడవాలి…” దగ్గరకు తీసుకుని చెప్పేది.
ఓ ముద్దిచ్చేది.
బలరాముడు పరిగెడితే, తమ్ముడు కృష్ణుడూ అతని వెనకే వెళ్ళాలిగా. అతని అన్న చేతిలో ఏదైనా ఉంటే, దాన్ని పట్టుకోవాల్సిందే. అతను తాగిన పాలు తాగాల్సిందే. అతను కూర్చున్న చోటే కూర్చోవాల్సిందే. అన్నయ్య చేసే ప్రతీదీ కృష్ణుడికి గొప్పగా అద్భుతంగా అనిపించేది.
పెరట్లో కర్రలకు కట్టి ఉన్న దూడల దగ్గరకు వెళ్లి నిలబడటం అతనికి చాలా చాలా ఇష్టం. వాటి మెత్తటి చెవులను నిమిరేవాడు. వాటి మెడలో కట్టిన గంటను మోగించేవాడు. దూడలు కదిలితే, దాని వెనుక తడబడుతూ వెళ్ళేవాడు. కొన్నిసార్లు ఏదో ఒక దూడ తోక పట్టుకుని నిలబడి నవ్వేవాడు, తానేదో సాధించినట్టు!
అతను నడిచిన ప్రతి చోటా
చిన్ని చిన్ని పాదముద్రలు,
ఒలికిపోయిన పాలు,
పడిపోయిన కుండలు,
నవ్వుతున్న గోపికలు కనిపించే వారు.
కృష్ణుడి నడకలోని అందాలను చూస్తూ యశోద తనకున్న చాలా పనులను మరచిపోయేది.
కృష్ణుడి ప్రతి అడుగుతో ఇల్లంతా ఆనందం వెల్లివిరిసేది. ఎంత విసుగున్నా ఇట్టే మటుమాయమై మాటలకందని ఆనందానుభూతితో తనను తాను మరచిపోయేది యశోద.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి