శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం---మంజుల పత్తిపాటి.
యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే...
శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…
చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!
వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!
కలలన్నీ కాలిపోయి  మిగిలిన ఒంటరి డొక్కలను 
ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..?
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని
 ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?
సహాయం చేయడం కేవలం దానం కాదు,
మనిషి మనిషిగా నిలవడం..!
ఒక గుండె విరిగిన కథ ఇది..!
ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు 
మనసు తడిపే కన్నీటి నిశ్శబ్ద గానం విని 
మంజుల పత్తిపాటి కలం  చెబుతుంది 
మనిషి కోసం మనిషి నిలవాలి అని
===============================
- మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218

కామెంట్‌లు