ఈర్ల సమ్మయ్యకు జాతీయ స్వర్ణనంది అవార్డు
 --ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి దక్కిన అరుదైన గౌరవం



 పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం,  ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2025-26 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి స్వర్ణ నంది అవార్డు లభించింది. జూన్ 28, 2026 రాత్రి వేద రూరల్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, వేద ఎన్జీవో, ఎంఎఎంకె ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కొమురవెల్లిలో నిర్వహించిన జాతీయస్థాయి స్వర్ణ నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అవార్డును అందుకున్నారు. సామాజిక సేవ, విద్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతను ప్రోత్సహించడం, సమాజ సంక్షేమం కొరకు ఈర్ల సమ్మయ్య చేస్తున్న కృషిని, అతని విశిష్ట సేవలను గుర్తించిన నిర్వాహకులు జాతీయ స్వర్ణ నంది  అవార్డు పత్రం, జ్ఞాపిక, పూలమాల, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈర్ల సమ్మయ్య  గత రెండేళ్లుగా ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో రూ. 30.25 లక్షలు మంజూరు చేయించి 3 తరగతి గదులను నిర్మించారు. గ్రామంలో డ్రాపవుట్స్ లేకుండా చేసి, పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచారు. దాతల సహకారంతో పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 40 బెంచీలు తెప్పించారు. పిల్లల కోసం రూ.1లక్ష విలువైన మినరల్ వాటర్ ప్లాంట్,  ఫ్రిడ్జ్,  రూ. 40 వేల విలువైన వాటర్ ట్యాంక్, గ్లాస్ బోర్డ్, స్మైల్ ఫౌండేషన్, రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూ. 8 లక్షల విలువైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ (స్మార్ట్ టీవీ), సోలార్ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయించారు. అతి త్వరలోనే పాఠశాలలో కంప్యూటర్లు, ఏసీలు, ఏర్పాటు చేస్తామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి, పిల్లల చదువులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లల్ని అద్భుతంగా తయారుచేసి, 2024 నుంచి 2026 వరకు వరుసగా రెండుసార్లు జిల్లా బెస్ట్ స్కూల్ అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈర్ల సమ్మయ్య మహాముత్తారం మండలం నాయక్ పోడ్ కాలనీ మొదటి నియామకం కాబడినారు. అప్పుడు పాఠశాల పశువుల పాకలో నడుస్తుండేది. పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కు ఆయన లేఖ రాసి, స్థానికుల ద్వారా అక్కడ చక్కటి పాఠశాల భవనాన్ని నిర్మింప చేశారు. అక్కడ పిల్లలకు చక్కటి విద్యను అందించారు, ప్రాథమిక పాఠశాలలు శ్రీరాంపూర్లో 7ఏడు, శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీలో 13 సంవత్సరాలు పనిచేసి, వాటిని అద్భుతంగా తయారు చేశారు. వేలాది మంది విద్యార్థులు, యువతను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. అంతేకాక తన పాటలు, సాహిత్యం, సామాజిక సేవ ద్వారా సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ అవి అర్హులైన ప్రజలకు అందేలా చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక అవార్డులను అందజేస్తున్నారు. ఈర్ల సమ్మయ్యకు జాతీయస్థాయి స్వర్ణనంది పురస్కారం రావడం పట్ల, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు విద్యార్థినీ, విద్యార్థులు గ్రామస్తులు, మండలం, జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేకులు ఆయన సేవలను కొనియాడుతూ అభినందిస్తున్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం