జనకమహారాజు దశరథుని సమ క్షమున వశిష్టునకు వంశవృత్తాంతమును తెలుపుట :- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
జనకుడు వశిష్ట మహర్షికి నమస్కరించి 
ఓ మహర్షి నీకు శుభముగలుగును
నా వంశము గూర్చి మీకు తెలిపేద స్వామి 
జనక నీ వంశము గూర్చి తెలుపుము

మా వంశ మూలపురుషుడు నిమి మహారాజు
అతడు ములోకాలలో ప్రసిద్ధిగాంచిన 
మిక్కిలి ధర్మాత్ముడు పరక్రమశాలి 
సత్యవంతుడు యుక్తిపరుడు 

అతని పుత్రుడు మిథి మిథిలానగర నిర్మాత
అతని కుమారుడు ఉదా పనుడు
అతని సూతుడు నందివర్ధనుడు 
నందివర్ధన పుత్రుడు సుకేతుడు 

సుకేతుని పుత్రుడు దేవరాతుడు 
అతని పుత్రుడు భృహద్రథుడు
అతని కుమారుడు మహావీరుడు 
మహావీరుని పుత్రుడు సుధృతి 

సుధృతి పుత్రుడు దృష్టకేతవు 
దుష్ట కేతువు పుత్రుడు హర్యశ్యుడు
అతని పుత్రుడు మరువు
మరువు పుత్రుడు ప్రతింధకుడు
ప్రతింధకుని పుత్రడు కీర్తిరథమహారాజు


కామెంట్‌లు