హలో పిల్లలూ! కిస్‌మిస్‌లు పాయసంలో బాగా నచ్చుతుంది కదా!మరి పాయసంలో వేసే కిస్‌మిస్‌తో నేను అమ్మాయిని చేశాను. ఈ అమ్మాయి కూడా తియ్యగా ఉంటుంది. కిస్‌మిస్‌లు ఎలా తయారవుతాయో తెలుసా!.ద్రాక్షపండ్లను ఎండబెట్టి తయారు చేస్తారు. వీటిని ఎండు ద్రాక్ష అంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వలన శరీరానికి శక్తి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతాయి. ఎందుకంటే ఇందులో ఐవరన్ అధికంగా ఉంటుంది. ద్రాక్ష రకాలను బట్టి కిస్‌మిస్‌లలో రకాలున్నాయి. పసుపు, నలుపు, గోధుమ రంగులలో కిస్‌మిస్‌లు దొరుకుతాయి. నేనీరోజు అమ్మాయిని నలుపు కిస్‌మిస్‌లతో తయారు చేశానవు. 5 నుంచి 10 వరకు కిస్‌మిస్‌లను నానబెట్టి ప్రతిరోజూ తీసుకోవాలి. కిస్‌మిస్‌లలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ ఉండటం వలన మలబద్ధకం తగ్గుతుంది. ప్రత్యేకంగా నల్ల ద్రాక్షల వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతాయి.
అమ్మాయి జుట్టు, లంగా, జాకెట్ అన్నీ నక్ష ద్రాక్షతోనే చేశాను. లంగాకు చక్కని డిజైన్ వేసి కిస్‌మిస్‌లు వేసి కుట్టాను. అందరూ కుందన్లు, చెమ్కీలు, ముత్యాలు వేసి లంగాలు, జాకెట్లు కుట్టుకుంటుంటే, నేను సపోటా గింజలు బాదం తొక్కలు, చింత గింజలతో అమ్మాయిల డ్రెస్సులు కుడుతున్నాను. మీక్కూడా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి. పాపాయి బట్టలకు రంగులు వేశాను. అందంగా తయారు అయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి