.రైతురంది: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు
రైతు పొద్దున లేచెను 
పొలమును చేరెను 
ఉయ్యాలాగా 
నాగలిని లాగెను

చెమట చుక్కలన్ని
నేలనుకార్చెను 
మబ్బుల కోసమేమొ
ఆకాశం జూసెను 

వానమ్మ మొరాయించగ 
రైతుకు రందీ మొదలాయె 
కాలువ నీరు ఎండిపోయె
బావులనీరు తగ్గిపోయె

వానమ్మ వానమ్మ
ఒక్కసారి రావమ్మ 
వేలసార్లు ప్రార్ధించగ
వరుణదేవుడు కనికరించెను.

మొక్క మొక్కను బిడ్డలాగ
ముద్దుగరైతుపెంచుతాడు 
పచ్చని పైరు చూసుకుంటూ 
పండుగేయని సంభ్రపడుతడు



కోతకు వచ్చిన బంగరు ధాన్యం 
కొండ లాగ కనిపిస్తున్నది 
మార్కెట్లో ధర గిట్టకపోతే 
రైతన్నకు కన్నీరొచ్చును 

ఇంత కష్టం చేశానంటూ 
మనసులోనే కుమిలిపోతడు
అన్నం పెట్టే రైతు గుండె 
బాధతోనూ నిండిపోతుంది

ఎండవానలను తట్టుకుంటు 
ధైర్యమెపుడు కోలుపోడు 
రైతు నవ్వితెదేశం నవ్వు
రైతు ఏడిస్తే లోకం ఏడ్చును

రైతు చెమటచుక్కల వలన 
మనఇంటిలోఅన్నంఉడుకును 
అన్నదాత రైతన్నను
ఆదుకోవాలి ఇప్పుడు.

కామెంట్‌లు