నా జీవన చందన వనమా: - డా.సి.వసుంధర
ఇది జ్యోత్స్న.
నెచ్చెలీ!
నీ చెలిమిచెమ్మ
అద్భుత భావ
రసవాహినగాప్రవహించి నా హృదయ క్షేత్రమయ్యే పవిత్ర బృందావనమ్ము.
  
తరుణి! నీ అరుణాధరమ్ము
మన్మధుని అమ్ము
అందుకొంటికొన్ని మధురవాక్కు 
లట నుండి
కంతుడే నేనైపోతి. 
ఇంతీ నీ రాకతో 
కంటి కమ్మనికలలుకొన్ని.
రాదు మరల ఇట్టి
మాధుర్య మధురానుభూతి. మన్మధ చేష్టలు కావివి నా శ్వాసలో శాశ్వత ప్రేమ ప్రవల్లికల
 పందిరిపై విరబూచిన తెల్లని మల్లియలే సుమా!

నిలువుమొక్కక్షణము వినిమునా మనవి ఎన్నియుగాలైన 
నీకై నే వేచియం
దు.కైరవి సాక్షిగా 
నీవే కావలె నా ధర్మపత్నిగా. 
నా తీర్పు తప్పని
సత్యవాక్కు.
 నీ సమ్మతీ ఒకసారిటు మరలి
చెప్పిపొమ్ము
ఇమ్ము నీ దర్శన భాగ్యముమరొక్కసారి గ్రమ్మర
నీ వదన కైరవ బింబ దర్శన భాగ్యమోసంగుమా!
 🍂🌷🪻🦋🪾🍁🪻🪸

కామెంట్‌లు