ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలపై కేరింగ్ ఎక్కువ: - ఈర్ల సమ్మయ్య
 --ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ


 ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు పిల్లలపై కేరింగ్(శ్రద్ధ)ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో  ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పిల్లలకు పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ఆయా గ్రామాలకు సంబంధించిన పిల్లలు మాత్రమే వస్తారని, అందువల్ల ఆ పాఠశాలల్లో పరిమిత సంఖ్యలో పిల్లలు ఉంటారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి తరలించడం వల్ల పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఒక్కో తరగతికి 40 నుంచి 50 వరకు పిల్లలు ఉండడం వల్ల ఒక్క టీచర్ అంతమందిని చూడడం కష్టమవుతుందని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతికి 15 నుంచి 20  మంది మాత్రమే పిల్లలు ఉంటారని అందువల్ల ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ (కేరింగ్) తీసుకుంటున్నారని, అందుకే ప్రైవేట్ పాఠశాలల కంటే  ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక ఫలితాలు వస్తున్నాయని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్, డీఈవో, ఏఎంఓ, డిఆర్పిల బృందం, ఎంఈఓ, ఎంపీడీవో, కాంప్లెక్స్ హెచ్ఎంలు అనుక్షణం అక్కడి బోధన తీరును పర్యవేక్షిస్తారని, ఉపాధ్యాయులు,  విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచడమే కాకుండా అద్భుతమైన బోధన జరిగేలా చూస్తున్నారన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు అత్యధిక ఫలితాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పాఠశాలలు, కొందరు వ్యక్తుల స్వప్రయోజనం కోసం ఏర్పాటు చేసుకున్నవని, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ప్రజలకు సేవ చేసే నిమిత్తం, పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం  ఏర్పాటు చేయబడ్డాయని ఆయన అన్నారు. కొందరు ఏజెంట్లను పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేస్తున్నారని, తల్లిదండ్రులు వారి మాయమాటలు నమ్మి మోసపోకూడదని, వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోకూడదని ఆయన కోరారు. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. గత విద్యా సంవత్సరంలో ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలందరూ 90 శాతం పిల్లలు డిస్టింక్షన్లో, మిగతా 10 శాతం పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ,  ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం