పౌరులం !!!: - యెనుముల వేణుగోపాలరావు,-అమలాపురం,
బాలలం మేము బాలలం,
భావితరానికి పౌరులం,
పిల్లలం మేము పిడుగులం,
అల్లరి చేసే బుడుగులం !

సమయానికి బడికి వెళతాము,
గురువు గారు చెప్పిన పాఠాలు వింటాము ,
బుద్ధిగా చదువు కుంటాము ,
ఆటలు ఎన్నో ఆడుకుంటాము!
                                       " బాలలం "

సాయంత్రం ఇంటికి వస్తాము,
హోమ్ వర్కులు చేసుకుంటాము,
అమ్మకు పనిలో సాయం చేస్తాము ,
బామ్మ గారు చెప్పే కథలు వింటాము !
                                     " బాలలం"

పిల్లలం మేము చిరు దివ్వెలం ,
ఆకాశం లో ఎగిరే గువ్వలం ,
ఎగిసిపడే నిప్పు రవ్వలం,
ముసి....ముసి..ముసి...ముసి నవ్వులం !!!

బాలలం మేము బాలలం ,
భావితరానికి పౌరులం ,
పిల్లలం మేము పిడుగులం ,
అల్లరి చేసే బుడుగులం !!!
              *****

కామెంట్‌లు