ఏది తక్కువ?: - ప్రవల్లిక భాస్కర్ . జి. Software engineer | Accenture , ఉప్పల్
విశాల గగనంలో చందమామపై వెలుగు
కాని నక్షత్రాలని చిన్నచూపు చూడకు.

నిరంతరం శ్రమించు విజయకేతనానికై
కాని ఇతరుల శక్తిని తక్కువగా చూడకు.

పచ్చికలోని మిడతలా ఎదిరెగిరి పడుకు
పతనానికి కారణం అహంకారమని మర్చిపోకు.

బావిలో కప్పలా అదే ప్రపంచం అనుకోకు
ఎదుటివారిచ్చే గౌరవం కొరకు మరోప్రపంచాన్ని వెతుకు.

వజ్రవైఢూర్యాలు కొలువైన నిధి కోసం ఆరాటపడకు
నువ్వు నడిచే మట్టిలోనూ మాణిక్యాలు దొరుకుతాయని మర్చిపోకు.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
Very nice