అనాధ బాలలు: - T. వరుణ్ తేజ -9వ,తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ బెజ్జంకి-జిల్లా: సిద్ధిపేట-చరవాణి8008798036.
 శీను,లతా భార్యాభర్తలు. రామపురంలోనివసిస్తున్నారు.వీరు చాలా పేదవారు. అర ఎకరం పొలం మాత్రమే ఉంది. ఇంకా మరి ఏమీ లేదు చుట్టాలు బంధువులు కూడా ఎవరూ లేరు.రోజు ఏదో కష్టం చేస్తూ బతుకుతున్నారు. ఆ అర ఎకరం పొలంలో ఏదో పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కొన్ని రోజులకు వీళ్ళకు కవల పిల్లలు జన్మించారు వాడు రాము, లక్ష్మణ్ ఇద్దరు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు పొలం పనులు ఆ పనులు ఈ పనులు చేసి శీనుకు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఇది జరిగిన కొన్ని రోజులకి పాపం లతా కూడా పొలం పని చేసేటప్పుడు ఏదో ఏదో పురుగు కొట్టి ఆమె కూడా చనిపోతుంది పాపం రామ్ లక్ష్మణ్ ఇద్దరూ కూడా చిన్నవాళ్లు తల్లి తండ్రి ఇద్దరు లేనందున పిల్లలు ఇద్దరు కూడా అనాధలుగా బ్రతుకును సాగించాల్సి వస్తుంది.రాము బడికి పోకుండా ఏదో ఒక పని చేస్తూ లక్ష్మణ్ కి అన్నం తినిపిస్తూ తమ్ముని చూసుకుంటూ ఉన్నాడు. వీళ్ళకు పొలం ఎక్కడ ఉంది అనేది ఏమీ తెలవదు.ఒక పెద్ద మనిషి వీళ్లను చూస్తున్నడు ఆ పెద్దమనిషి వీళ్ళ భూమిని కూడా దక్కించుకున్నాడు ఆకలితో అప్పుడప్పుడు లక్ష్మణ్ మన్ను కూడా తినేవాడట అది చూసిన రాము కాస్త తమ్ముడికి అన్నం పెట్టేవాడట. వీళ్ళని పట్టించుకునే వారే లేరు.
ఇంకా ఇటు పక్క వారు అటు పక్క వారు ఈసరించుకునే వారట. తల్లి తండ్రిని ఇద్దరు పోగొట్టుకొని అనాధలు అయిపోయారు. బందువులు చుట్టాలు కూడా ఎవరూ లేరు.  ఊరికే ఆ మాటలు అనేవారట అలాంటి మాటలు విని బాధ భరించలేక రాము లక్ష్మణ్ ఇద్దరూ ఏడుస్తూ ఉండేవాళ్లట. ఇంటి చెత్త చెదారం లోపటనే పడుకునే ఉండేవారట. ఈ లోపట ఎక్కడో దూరపు బంధువు సుజాత  వచ్చేసింది వీళ్ళ రాము లక్ష్మణ్ వల్ల గురించి తెలుసుకొని అయ్యో మా దూరపు బంధువుల పిల్లలు అయిపోయారు ఉరివాలి ఇలా పట్టించుకోవడం లేదు ఎందుకు అని  వాళ్లకి అవసరాలు తీస్తూ గురుకుల పాఠశాలలో చేర్పించి ఆ పొలం కా చేసినటువంటి వ్యక్తి నుంచి అర ఏకరం పొలం వీళ్లకు ఉన్నదని చెప్పి వాళ్లకు మంచి బుద్ధులు చెప్పి చక్కగా చూసుకుంది దూరం కొడితే ఎవరైనా అనాధలే అయిపోతారు దగ్గర తీస్తే అంతా బంధువులు చుట్టాలు మన వారే అవుతారు. రామ లక్ష్మణ్ మంచిగా చదువుకుంటూ వున్నారు.

---------------------------------------------------------


 

నీతి:తల్లి తండ్రి లేని వారు అనాధలు కాదు. సమాజంలో మంచి మనసు లేని వారే అనాధలు. 

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం