రామవరం అనే గ్రామంలో సావిత్రి సుందరం అనే దంపతులు ఉండేవారు సుందరం గుడి పూజారి సావిత్రి బడిపంతులమ్మ వీళ్ళకు లేక కూతురు పుట్టింది ఆమె పేరు రవళి పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టింది సావిత్రి సుందరం బాగా ఏడ్చారు. పెరుగుతున్న కూతురు లేవలేదు నడవలేదు సరిగా మాట్లాడలేదు కన్నా కడుపు మమత కొరకు తల్లి తండ్రి బిడ్డకు సేవలు చేస్తూ బాధతో కాలం వెళ్లదీస్తున్నారు
మై ఐదేళ్ల వయసు వరకు వచ్చింది బయటకు వెళ్లి ఆడుకుందాం అంటే ఎవ్వరు కూడా దగ్గరికి రాలేదు ఆమె వెళ్లలేదు తల్లి ఎత్తుకొని బయటకు తీసుకువెళ్లిన అందరు కూడా ఎగతాళి చేసేవారు చిన్న మనసుతోటి పాపం ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఆ బాధను ఎవరికీ చెప్పుకునేది కాదు చిన్నబోయి కూర్చునేది ఒకరోజు సావిత్రి నా బిడ్డను బడికి తీసుకుని వెళ్తే ఏమైనా లాభం జరుగుతుందేమో రోజు అయినా నేను ఎత్తుకొని వెళ్తాను అని చెప్పేసి అక్కడే ఉన్న పాఠశాలకు తీసుకొని వెళుతుంది అది ప్రభుత్వ పాఠశాల అయ్యో ఏంటి ఇలా ఉంది అని విచిత్రంగా చూస్తారు అక్కడ ఉన్నటువంటి రజిత టీచర్ అలా అందరూ దగ్గరికి రావద్దు అని చెప్పి పంపిస్తుంది.
అప్పుడు రజిత సావిత్రి దగ్గర తీసుకొని ఏంటమ్మా ఏంటి బాధ ఈ అమ్మాయికి ఎందుకిలా అంటే అమ్మ చిన్నప్పుడే ఇలా జరిగింది పుట్టినప్పటినుంచి అంగవైకల్యంతోటే ఉంది నడవలేదు స్పష్టంగా మాట్లాడలేదు ఎడమ చేయి కూడా సరిగా రాదు. కాస్త కుడిచేయి మాత్రం కొంచెం పని చేస్తుంది అని చెప్తుంది అమ్మ రోజు పిల్లలందరిని చూసి నా కూతురు బాధపడుతుంది సరే మీ ప్రభుత్వ పాఠశాలలో వికలాంగుల పిల్లలను చేర్పించుకుంటారట వారికి ప్రత్యేకమైన పాఠశాల ఉపాధ్యాయులు ఉంటారట చెప్పగా విని మీ పాఠశాలకు వచ్చాను అని చెబుతుంది
వెంటనే రజిత టీచర్ ప్రధానోపాధ్యాయులు గారి దగ్గర తీసుకువెళ్లి ఆమె పరిస్థితి నంత వివరిస్తుంది ఈ అమ్మాయిని రోజు తీసుకురా అమ్మ నాకు చేతనైన సహాయం నీకు చేస్తామని చెప్తుంది ఈ అమ్మాయికి కుడి చేయి కొంచెం బాగానే ఉంది ఈమెతో చిత్రాల గీయించడం నేర్పిద్దాము అంటుంది
రజిత టీచర్ చిత్రాల గీయడంలో అందవేసిన చేయి ఆ అమ్మాయిని చూడగానే ఆమె కూడా పాపం అనిపించేసి రోజు ఆమెతో చిన్న చిన్న చిత్రాల గీయిస్తూ అలవాటు చేస్తుంది అలా అలా చిత్రాలు గీయడం లోపల కాస్త నైపుణ్యాన్ని సంపాదించింది ఆమెకు మెలకువలు కూడా చెప్పింది రజిత టీచర్ చిన్న చిన్న పోటీలు పాఠశాల పోటీలకు కూడా చిత్రాల గీస్తూ ప్రతిమ బహుమతులు అందుకుంటుంది రవళి
అప్పుడు జిల్లా స్థాయిలో చిత్రాల పోటీ ఏర్పాటు చేస్తారు రవళి చిత్రం గీసి పంపించిన దానికి ప్రథమ బహుమతి వస్తుంది పాఠశాలకు తెలియజేస్తారు స్థాయిలో వచ్చి బహుమానం తీసుకోవాలని చెప్తారు
రవళి చాలా సంతోషపడుతుంది కానీ మళ్ళీ బాధపడుతుంది దాని వెళ్ళలేదు కదా నన్ను ఎవరు తీసుకు వెళ్తారు అని అప్పుడు రజిత టీచర్ వాళ్ళ అమ్మానాన్నలకు తెలియజేసి నేను కూడా నీ వెంట వస్తానని ఆమె ధైర్యాన్నిస్తుంది ఇక జిల్లా స్థాయిలో బహుమానం అందుకోవడానికి రవళితో అమ్మానాన్న రజిత టీచర్ వెళ్తారు స్టేజి మీద అనౌన్స్ చేయగానే చాలా సంతోషపడుతుంది రవళి రవళి తల్లిదండ్రులు రజిత టీచర్ కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తారు కానీ అక్కడికి పైకి వెళ్ళలేదు అని తెలిసింది విషయం తెలిసి వాళ్ళే కిందికి వచ్చి ఆమెకు సన్మానం చేసి వచ్చిన బహుమానం అందజేస్తారు రెండు విషయాలు మాట్లాడమంటారు అప్పుడు రవళి చెప్తుంది నిజంగా నేను జీవితంలో ఈ దశకు వస్తాను అనుకోలేదు నా వైఖల్యమే నాకు నష్టం చేస్తుంది అనుకున్నాను కానీ నా తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు రజిత మేడం సహాయం చేయగా నేను ఇంత గొప్ప చిత్రాన్నిలను గీచి బహుమతిని అందుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది రవళి వారి వార్తల్లో కూడా జిల్లా స్థాయిలో బహుమతి పొందుకున్న రవళి అంగవైకల్యాలు జయించింది అనే వార్తను చూసి చాలా చాలా సంతోషించింది అంటే జీవితంలో వైకల్యం అనేది దేనికి ప్రగతికి అడ్డురాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసింది
మనిషి ఎదుగుదలకు ఉత్సాహము శ్రమ ఉండాలి వైకల్యాన్ని గాని దేనినైనా జయించవచ్చు అనేది రవళి నిరూపించింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి