రంగులు : - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-ZPHS బక్రిచెప్యాల


పచ్చనిచిలుకకొమ్మలకూయగ
పలుకులు ముత్యాలైజారే
ఎర్రనిముక్కుతో అందముగ
జామపండు కొరుకు చుండెను
 
తెల్లని పావురమురెక్కలతో
శాంతి సందేశమే తెచ్చు 
మృదువైనా గువ్వల జంట 
కిలకిల రాగము వినిపించు

నల్లని కాకి అరుపులతో 
ఇంటికి వచ్చిరి బంధువులు 
కాక అంటే అన్న తమ్ముడిని
వరుస గలిపి పిలుచుచుండును.

బంతిపూలు పసుపురంగుతో
పరిమళాలువెదజల్లుచుండును
ఎర్రని గులాబీ నవ్వులతో 
ప్రేమల దీపం వెలిగిపోయెను

తెల్లని మల్లెల తోటలలో 
కమ్మని వాసనలవి వీచే
ఎర్రని మందారాలన్ని
ఆనందముగా నింగిని చూచెను

తెల్ల తామరలు నల్లని కలువలు
చక్కగా తేలెను కొలను యందున 
తేనెల గుంపులు వచ్చి 
కమ్మనిపాటలుపాడుచుండెను.

పక్షుల,పూలరంగులు 
ప్రకృతి ఇచ్చే వరమండి 
చూడగానే మనసు నిండి 
సంబురాల సుగంధమయ్యె

రంగులేయన్ని కలలతోటలై 
అలరారే ఈ వేళ యందున 
పక్షుల పూల సోయగాలతో 
పులకరించే ఈ పల్లె తల్లి.

కామెంట్‌లు