ఒక గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. బడిలో అతని టీచర్ చెట్టు నాటి నీరు పోయండి అని చెప్పింది.రాజు చెప్పిన విధంగానే మొక్క నాటి రోజు నీరు పోసేవాడు కానీ కొన్ని రోజులకు మొబైల్ వచ్చింది. చెట్టుకు నీరు పోయడం లేదు అది కొద్దిగా పెద్దదయింది.బడి నుంచి రావడం మొబైల్ చూడటం ఇలా రోజు సాగుతుంది.ఒకరోజు రాజురోజులాగానే చెట్టు కింద కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకు ఒక శబ్దం వినిపించింది.ఏంటా అని రాజు అటు ఇటు చూసాడు.ఎవరు లేరు.రాజు భయపడ్డాడు! చెట్టు ఈ విధంగా అంటుంది రాజు మొబైల్ రాకముందు నాకు రోజు నీరు పోసేవాడివి. ఇప్పుడు ఎందుకు పోయట్లేదు భయపడకు రాజు నేను నీ ప్రియమైన చెట్టును అని అన్నది. రాజు ఆలోచనలో పడ్డాడు. చెట్టు చెప్పింది నిజమేగా నేను మొబైల్ చూస్తూ చెట్టుకు నీరు పోయట్లేదు అని మనసులో అనుకున్నాడు. నా ప్రియమైన ఓ చెట్టు నన్ను క్షమించు గాలిని నీడను నీవు ఇస్తావు నువ్వు లేకుంటే ఏ ప్రాణి జీవించాలి. నేను రోజు నీరు పోస్తాను ఇంకా మా గ్రామంలోని సర్పంచ్ వద్దకు పోయి మన గ్రామంలో చెట్లు నాటాలి అని మాట్లాడి వస్తా అని చెప్పి సర్పంచ్ వద్దకు పోయాడు. సర్పంచ్ కు ఈ ఆలోచన బాగా నచ్చింది. గ్రామం మొత్తం మొక్కలు నాటారు.ఈ గ్రామం పచ్చదనంతో నిండిపోయింది వేరే గ్రామం వారు వచ్చి ఆ గ్రామంలో చూసి పోయేవారు రాజును అందరు బాగా మెచ్చుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి