నా ఇండియా పర్యటన - తీర్థ యాత్రల కవన హారం.
తుల్జా భవాని ఆలయం - స్వయంభు - శక్తి పీఠము.
శ్రీ సతి అంశగ తుల్జా
వాసవి శ్రీ శక్తిపీఠవాసిని దుర్గే
దోసము లెంచక త్వరిత గ
దాసుల గాయగ స్వయంభు దానవ వైరీ
=======================================
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ (ప్రస్తుతం ధారాశివ్) జిల్లాలో ఉన్న తుల్జా భవాని ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.
తుల్జా భవాని అమ్మవారి విగ్రహం సహజసిద్ధంగా వెలిసి “స్వయంభు” గ ప్రసిద్ది చెందింది.
స్కంద పురాణం ప్రకారం, కర్దమ అనే ఋషి భార్య అనుభూతి, దేవి కోసం తపస్సు చేయగా, కుకుర్ అనే రాక్షసుడు ఆమెను హింసించడానికి ప్రయత్నించాడు. అప్పుడు భవాని మాత ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి అనుభూతిని రక్షించింది. భక్తుల పిలుపును త్వరగా ఆలకించి ప్రత్యక్షమయ్యే తల్లి కావడంతో ఆమెకు * 'త్వరిత' * లేదా 'తుల్జా' అనే పేరు వచ్చింది.
- వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
#################
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి