క్షత్రియుల బలము కన్నా
బ్రాహ్మణుల బలము మిన్న
విశ్వామిత్రుడు మహావీరుడే భయము వద్దు
నీ తపశక్తి తిరుగులేనిది స్వామీ !
నీ బ్రహ్మ బలముచే నాలో శక్తి వచ్చినది
నాకు ఆజ్ఞనిమ్ము అతని బలగర్వమును
నీ ముందే చిత్తు చేసి చూపిస్తాను
వసిష్ఠుడు కామదేనువుతో ఇలా అంటాడు
వారి నోడించే సైన్యమును సృష్టించు
ఆమె బలమైన సైన్యాన్ని సృష్టించగా
విశ్వామిత్రుని సైన్యమంతా అంతమైనది
తన సైన్యము హతమవుట చూసి
రోషముతో రథమునధిరోహించి
వివిధములగు అస్త్రములేసి
పప్లవులను హతమార్చినాడు
దేనువు కోపముతో శకులను, యవనుల
అసంఖ్యకాముగా సృష్టించెను
వారిని చూసిన విశ్వామిత్రుడు
శక్తిగల అస్త్రము లేసి హతమార్చినాడు
====================================
బాలకాండ మందు 54వ సర్గ సమాప్తము. 🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి