అంశము: దత్తపది
దత్తపది: వాన, వాన, వాన, వాన
విషయము: అన్యార్థములో - (వాన = వర్షము అనే అర్థంలో కాకుండా ఇతర అర్థము లో..) ప్రతి పాదములో, నాలుగు పాదాలలో , మొదటి పదము!
ఛందస్సు : కందము
దత్తపది: వాన, వాన, వాన, వాన
విషయము: అన్యార్థములో - (వాన = వర్షము అనే అర్థంలో కాకుండా ఇతర అర్థము లో..) ప్రతి పాదములో, నాలుగు పాదాలలో , మొదటి పదము!
ఛందస్సు : కందము
కందం:
వాన ర వాలజ్వాల ద
వాన ల కీలల సకలము బాసి పురమికన్
వాన ప్రస్థిగ దోచె, శి
వా! న గరి కి శరణనగ నభయమిడు వరదా!
(వాన)ర = హనుమంతుడు ( వాల జ్వాల = తోక తో ముట్టించిన మంట) => వర్షము కాని వాన
ద(వాన)ల = మంటలు => వర్షము కాని వాన
(వాన) ప్రస్థిగ = వాన ప్రస్థము => వర్షము కాని వాన
శి(వా! న) గరి - శివా - నగరి => వర్షము కాని వాన
==============================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి