మునిబాలుని మాటలు విని దశరథుడు మిక్కిలి దుఃఖించుట
వారు దప్పికతో నాకై నిరీక్షించుచుందురు
ఓ దశరథమహారాజా!
వెంటనే మా తండ్రి కడకు వెళ్ళి వారి దాహము తీర్చుము.
ఇచ్చటికి సమీపమున మా ఆశ్రమము కలదు
ఇక్కడ జరిగిన వృత్తాంతము దెలుపుము
లేనిచో ఆ మహర్షి కృద్దుడై చెలరేగిన అగ్నివలె
ఓ రాజా! నిన్ను దహించి వేయును
ఓ మహారాజా! నీవు ప్రయోగించిన బాణము
పారేజలము గట్టును కోసిన రీతిగా
నా ఆయువును మిక్కిలి పీడించుచున్నది
నానుండి ఆ బాణమును తొలగించుము
ఓ మహారాజ నా మాటను ఆలకింపుము
నేను శోకమును నిగ్రహించుకొని యున్నాను
నేను బ్రాహ్మణుడను కాను
వైశ్యుని వలన శూద్ర స్త్రీ యందు జన్మించితిని
బ్రహ్మహత్య పాపము మీకు అంటదు
అతని శరీరము నుండి బాణము తొలగించితిని
నన్ను చూచుచు ప్రాణాలను వదిలెను
ఆ బాలుని చూసి మిక్కిలి విషాదమునకు గురియైతిని.
==================================
అయోధ్యకాండము నందు 63వ సర్గ సమాప్తము 🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి