63వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

శబ్దభేదిబాణముతో ముని బాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట
 


మిక్కిలి దుఃఖముతో ఆ మహారాజు 
అడవిలో తానొనర్చిన దుస్కార్యమును
తన మనసున పదేపదే జ్ఞప్తి తెచ్చుకొని 
కౌసల్యతో ఇట్లు చెప్పుచుండెను 

ఓ కళ్యాణి! నా మాటలను జాగ్రత్తగా వినుము 
మానవుడు చేసే పుణ్య పాపములతోనే
తగినరీతిగా సుఖదుఃఖములుండును 
అదే విధముగా నేను అనుభవించుచున్నాను

నేను యుక్తవయసులో ఉన్నప్పుడు 
దూరమున యుండి శబ్దమును వినియు
ఆ దిక్కుకు బాణములను వేసి
లక్ష్యము చేదించే శక్తిని గలవాడిని 

నేను ఒక మహాలాభమును ఆశించి
బానప్రయోగము చేయుట వలన 
ఇంతటి దుష్ఫలితము నాకు ప్రాప్తించెను 
అది యెరుగక తీరని వ్యధకు గురియైతిని 

"ఓ దేవి! అప్పటికి మన పెళ్లి జరగలేదు 
అప్పుడునేను యువరాజుగా ఉంటిని 
అహ్లాదపరచు వర్ష ఋతువు వచ్చినది 
సంతోషముతో నేను వేటకు వెళ్లాను.

కామెంట్‌లు