స్వాగతం! సుస్వాగతం : - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ


నాయకులారా మా ప్రజా నాయకులారా
మీరు వినరండి ఇంపుగా కనరండి సంపుగా
విచ్చేసిన వచ్చేసిన మీరంతా ఐక్యంగా ఉండి
కల్వకుర్తి ప్రజల కష్టాలను పంచుకున్న రండి!
అందుకే మీకు ఈ స్వాగతం మా సుస్వాగతం !

కల్వకుర్తి కవుల కీర్తి పెంచినట్టి
మేలించినట్టి
వీరంతా జనంతో ఏకమై ఉడుం పట్టు పట్టి
స్థానిక బహు సమస్యల లిస్టును చేపట్టి
పరిష్కరించారు ఫలితం చూపించారు

అందుకే అందుకోండి ఈ ఘన స్వాగతం మా సుస్వాగతం

బీడు పడ్డ భూములను దర్శించిన మీరు
అడ్డుపడ్డ వారి అడ్డును తొలగించుకున్న తీరు
ఏరికోరి మీరంతా ఎత్తిపోతలను
ఎంచుకున్నరు
కల్వకుర్తి నీటి ప్రాజెక్టుల సాధించుకున్నరు !

అందుకోండి అందుకోండి మా వందనాలు
ముందుగుండి పొందుతో మా చందనాలు
జనం ఘనంగా అందించే ప్రియ వందనాలు
ధనం కన్నా విలువైన వారి ఇంధనాలు !

అందుకే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం
ముందుగా తెలుసుకోండి గతం మా స్వగతం
జనశక్తితో నడపండి మీరు మన ప్రగతి రథం
జ్ఞాన భక్తితో గడపండి మీ శేష జీవిత పథం !

కామెంట్‌లు