భరతమాత ముద్దుబిడ్డ మన బాలగంగాధర్ తిలక్
మహారాష్ట్ర ప్రాంతంలో రత్నగిరి జిల్లా యందు తాను
జన్మించుట మన భారతదేశం ధరణి గడ్డ గుడ్ లక్ !
ఆయన కేసరి పత్రిక బెంగాలను వెన్ను తట్టి లేపింది
స్వాతంత్ర సమరానికి ఉత్తేజపు ఉయ్యాలను ఊపింది
వందేమాతర గీతం స్వదేశీ ఉద్యమానికి ఊతం అయ్యింది
నినాదాల హోరులో జోరులో ఉద్యమం సొంతం అయిపోయింది !
గీతా రహస్యాన్ని వివరిస్తూ కర్మయోగ శాస్త్రాన్ని రచించే
ఆర్కిటిక్ హోమ్ లో వేద రహస్యాలను వచించె నిర్వచించే
హిజ్ రైటింగ్ స్పీచెస్ లో సంఘ సంస్కరణ సందేశాలను అందించే
ప్రజలందరి హృదయాలలో తాను చిరంజీవి యై జీవించే!
బ్రిటిష్ గవర్నమెంట్ గుండెల్లో నిదురించినవాడు
అదరకుండా బెదరకుండా వారిని ఎదిరించిన రేడు
మహారాష్ట్ర బెంగాల్కు మధ్య వారధి ఈ తిలక్
ఆంగ్ల ప్రభుత్వ ధిక్కార స్వరానికి పెట్టాడు చెక్
మనం సవ్యంగా నిర్వహించు తిలక్ మహనీయుని సంస్మరణ సభ
జనం నవ్య కాంతులతో వెలుగొందు దివ్యమై మెరియు ఓ ప్రభ
సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇలలో వెలుగుతూనే ఉంటుంది ఇది
ఆరు నూరైనా నూరు ఆరైనా మరువదుగా మా యొక్క మది !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి