ఎవరి గదుల్లో వారే: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.


రాతియుగం నుంచి ప్రకృతిలో
 ఆడిపాడిన అద్భుతశక్తి 
పెరిగిన జ్ఞానం తరిగిన ప్రేమ
ఎవరి సెల్ లల్లో వారే 
అపార్ట్ మెంట్ నగరంలో

గంపెడు పిల్లల కోడిని కమ్మిన
సంతోషం
పిడికెడు ప్రేమకు చిటికెడు మనసు దూరం
ఇల్లు నేడు ధ్వని ప్రతిధ్వనులు లేని మృతకళేబరం 

పరుగుల లోకంలో
ఎవరికి వారే బతుకుపోరుగా
పొరుగు పొడ తెలియని స్వార్థం 
సగం సగం పని వేగిరంలో నిజమే ఆగమాగం 
పైపై మాటలన్నీ ఎగిరిపోయే గాలికి

ఆపై మన అడుగుల చప్పుడు
పల్లెగుండెల్లోనే వెదకాలి 
వాకిట్లో మనిషి కలిసిన మానవీయ ఆప్యాయతకోసం 

కామెంట్‌లు
Dr.klv prasad చెప్పారు…
చాలా బాగా రాసారు సర్.కానీ ఇప్పుడు పల్లెలు కూడా పట్టణాలను మించి ఉన్నాయనిపిస్తుంది.మీకు అభినందనలు