నిను వీడని నీడను నేను
నీవెంటే ఉంటాను
నువ్వెక్కడుంటే నేనక్కడనే ఉంటా
అర్థాంగినై అనుసరిస్తూనే ఉంటా
సప్తపది నాటి బాసలను నెరవేరుస్తుంటా
నీవెనకుండి నిన్ను ముందుకు నడిపిస్తా
సాధించినా సహకరించినా శోధించినా సతిని నేనే కదా
ప్రతిపనిలో నా ముద్రను తప్పక వేస్తూ,
నీకోసం నమ్మకమైన శ్రోతనవుతా
నీవు దూరము జరిపినా నేను దగ్గరే ఉంటా
మూడుముళ్ళ బంధానికి నిర్వచనమై మెలుగుతా
నువ్వేకావాలని ఎలుగెత్తి చాటుతా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి