బ్రతుక్కూ ఆధారాన్ని దారాన్ని ఇస్తుంది.
శరీరంలోకి పెద్ద పాముల ప్రాకుతుంది
నిశ్శబ్దంగా పొద్దును మింగి రాత్రిని విసర్జిస్తుంది.
ఆకారం లేని తలకాయలు నేల మొండనికి అతుక్కుని వేలాడుతున్నవీ
గుండె మాటలు విన్న రక్తం మంచి చెడులను వేరు చేస్తుంది.
ఎగిరిపోతున్న శరీరం రక్త మాంసాలను విడిచి అస్తిపంజరాన్ని మోస్తుంది.
శరీరంలోకి దూసుకెళ్లిన గాలి పేలిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది.
రంగుల్ని గురించి మాట్లాడిన చూపులు కత్తులుగా మారి
మాటలను విడగొడుతుంది. సూదుల్లా మారి మళ్లీ కలుపుతుంది.
తీయదనాన్ని కలిగిన తేనెటీగ మనిషిలా మకరందాన్ని దోచుకుని దాచుకుంటుంది.
చీకటిని పూడ్చిపెట్టితే మట్టిలా మారి వెలుగు మొక్కల్ని పుట్టిస్తుంది.
కన్నుల్ని కలిపి చెవుల్ని చీల్చి మనసుకు నిప్పంటిస్తే మనిషి తుపాకి గుండులా మారిపోతాడు.
పలుకుల పచ్చదనం విచ్చుకొని అడవి అంత పక్షులు వాలిపోతున్నాయి.
గాలికి రంగులు పూసి ఆకాశంలోకి వదిలితే రంగుల వర్షం కురుస్తుందా.
ఇంద్రధనస్సులు విరియాలంటే కిరణం పేలి నీరు విస్ఫోటనం చెందితే
తెగిపడ్డ తలా మొండాల్లా భూమి ఆకాశము తొంగి చూడాలా
ఎదురీదే చేపల్లా పాకుతున్న సూర్యుడు రక్తసముద్రంలో పడి తల పగలగొట్టుకున్నాడు..!!
======================================
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి