కానీ, నీ గదిలో మాత్రం
కావ్యాలు మాత్రం నిండుగా ఉన్నాయి.
లైబ్రరీలో మీ "విశ్వంభర"
తీశాను.
పేజీలు తిరగగానే...
మీ గొంతు వినిపించింది.
" కులం లేదు- మతం లేదు"
అని రాశారు.
బయటికి వచ్చి చూస్తే....
గోడల పై కులాల పేర్లు...
అప్పుడు అర్థమయింది.
నీ కల ఇంకా సగంలోనే ఉందని,
అది సాకారమయ్యేది ఎప్పుడో ......!?
మీ అక్షరాలను...
ఆయుధాలుగా మలుస్తాం !
సంస్కార భారతం కోసం పోరాడుతాం !!
జై సినారె..!
జై తెలుగు సాహిత్యం !!
" రసస్రవంతి " / "కావ్యసుధ "
కవిద్వయం
9247313488
హైదరాబాద్
--------------------------------------------------
( పద్మశ్రీ డాక్టర్. సి.నారాయణరెడ్డి 95వ పుట్టినరోజు సందర్భంగా..)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి