"మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు" ఆవిష్కరణ


మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాసిన కథల సంకలనం " మహబూబ్ నగర్ జిల్లా బడిపిల్లల కథలు" పుస్తకాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి లో జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులు చక్కటి కథలు రాయడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల్లో అభ్యసనాభివృద్ధికి, పఠనాసక్తిని పెంపొందించడానికి ఈ కథలు ఉపయోగపడు తాయన్నారు. ఈ కథలను తీసుకురావడానికి కృషి చేసిన సంపాదకులను ఆయన అభినందించారు. పాలమూరు ఎన్.ఆర్.ఐ.ఫోరమ్ ఆర్థిక సహకారంతో పుస్తకాన్ని వెలువరించడం పట్ల ఆయన ఎన్.ఆర్.ఐ ఫోరాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ రమేష్, ఆర్జేడీ సోమిరెడ్డి, సెంట్రల్ స్క్యోర్ ఫౌండేషన్ బృందం, జిల్లా ఎ.ఎం.ఓ దుంకుడు శ్రీనివాస్ , జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ ప్రశాంత్ , జిల్లా ఎస్.ఎస్.ఎ.బృందం తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు