సంతవురిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో, ఆ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయని వడిగి వేదవతి, ఏభై వేల రూపాయలు విలువ చేసే ఆర్ ఓ ప్లాంట్ ను బహూకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వెంకటరావు నేడు ప్రారంభించి నేటి నుండి వినియోగం లోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వంతో కూడిన వేదవతి గారి త్యాగనిరతి ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ
పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు 180 మంది పిల్లలు ఉండగా, వారికి మంచినీటి అవసరాన్ని గుర్తించిన వేదవతి, ఈ ఆర్ ఓ ప్లాంట్ కోసం ఏభై వేల రూపాయలు వెచ్చించి నిర్మాణం పనులు చేయించి అందరికీ మంచి నీరు అందేలా ఆచరణ గావించడం ఎంతో అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయుల కార్యదర్శి సి.హెచ్.కమలాకరరావు, ఉపాధ్యాయులు టి.హరికృష్ణ, బి.సూర్యనారాయణ, సి.హెచ్. వేణుగోపాలరావు, ఎం.జగన్ లీల, డి.బాబ్జీ, జి.వెంకటరావు, పి.రమేష్, సి.హెచ్. సునీత, వి.దాలినాయుడు, కె.వెంకటలక్ష్మి, పి.తిరుపతిరావు, ఎస్.సలీం, ఎన్.రవికుమార్, సి.హెచ్. అలివేలు మంగ, టి.ఎస్.ఎ.ఎన్. మూర్తి, డి.శ్రీనివాసరావు, కె.పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి