వ్యవసాయం -భౌతికమైనది
విద్యా విధానం- మానసికమైనది.
వ్యవసాయం -రైతు చేతుల్లో ఉంటుంది.
విద్యా విధానం -ఉపాధ్యాయుని చేతుల్లో ఉంటుంది.
చెట్టు పెరగడానికి -మట్టి కావాలి
చదువుకోవడానికి -మెదడు కావాలి
వ్యవసాయానికి -కాంతి కావాలి
విద్యకు- శబ్దం కావాలి..............!!
చెట్టు నిశ్శబ్దంగా పెరుగుతుంది
విద్యార్థి శబ్దంతో ఎదుగుతాడు
చెట్టు ఎంత ఎదిగిన ముసలిదవ్వదు.
విద్యార్థి చదువుతో ఎదుగుతాడు
శరీరంతో ముసలివాడు అవుతాడు.
చెట్టు ఎదగాలంటే నీరు కావాలి
మనిషి ఎదగాలంటే చదువుకోవాలి
చెట్టు పలాలనిస్తుంది.
చదువు కలలను నిజం చేస్తుంది..!!
వ్యవసాయానికి చెత్త ముఖ్యం
చదువుకు విత్తనం ముఖ్యం.
మట్టి మారుతుంది విత్తనం మారదు
మనిషి మారుతాడు చదువు మారదు.
చదువుకు వ్యవసాయానికి గురువు సహాయం కావాలి.!!?
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి