నాకు నచ్చిన కవి: - N.సాత్విక్-7వ తరగతి- పి.యం.శ్రీ ఘన్ పూర్ (స్టే)- జనగామ (జిల్లా)
 

తెలుగు సాహిత్య ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ ఉద్యమ కవి, గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్య
జననం- బాల్యం:1925 జులై 22న ప్రస్తుత మహబూబాబాద్ (నాటి వరంగల్ జిల్లా )చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు.
భాషా ప్రావీణ్యం: తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఆంగ్ల భాషలలో అపారమైన పాండిత్యం సంపాదించారు. ఉర్దూ తెలుగు తనకు రెండు కండ్లలాంటివని తరచూ చెప్పేవారు.
నిజాం వ్యతిరేక పోరాటం-అగ్ని ధార:
నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలను ఎదిరిస్తూ తన కలాన్ని ఆయుధంగా మలిచారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గర్వంగా ప్రకటించి తెలంగాణ విముక్తి ఉద్యమానికి అక్షర రూపం ఇచ్చారు.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఆయనను నిజామాబాద్ జైలులో నిర్బంధించారు. అక్కడ పళ్ళు తోముకునే బొగ్గు ముక్కతో జైలు గోడలపై పద్యాలు రాసి తన ధైర్యాన్ని నిరూపించుకున్నాడు.
నిజాం పాలనను నిరసిస్తూ ఆయన రాసిన "అగ్నిధార" కావ్యం ఎంతో సంచలనం సృష్టించింది.
ప్రముఖ రచనలు:
అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం కవితా పుష్పకం (ఖండం కావ్యాలు)
తిమిరంతో సమరం ( ఈ కవితా సంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది)
గాలిబ్ గీతాలు (ప్రసిద్ధ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ గీతాలకు తెలుగు అనువాదం)
రుబాయిలు(పర్షియన్ సాహిత్య ప్రక్రియను తెలుగు లోకి తీసుకు వచ్చారు)
యాత్రా స్మృతి(ఆత్మకథ)
చలన చిత్ర రంగం:
1961లో ఇద్దరు మిత్రులు సినిమాతో  సినీరంగ ప్రవేశం చేసి కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు.
బిరుదులు పురస్కారాలు:
ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 నుండి 1983 వరకు సేవలు అందించారు
అభ్యుదయ కవి సామ్రాట్, కవి సింహం, కళా ప్రపూర్ణ వంటి బిరుదులు అందుకున్నారు.
ఆయన జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి దాశరధి సాహిత్య పురస్కారం అందజేసి గౌరవిస్తుంది.
మరణం:
1987 నవంబరు 5వ తేదీన శాశ్వతంగా కన్నుమూశాడు దాశరథి.
                                                  
కామెంట్‌లు