కొబ్బరి పీచు కోకిల: -డా. కందేపి రాణీప్రసాద్
 

హలో పిల్లలూ! మీరు కొబ్బరి పీచును చూశారా! పూర్వకాలంలో కొబ్బరి పీచుతో అంట్లు గిన్నెలు తోముకునేవారు. శుభ్రంగా తోముకోవచ్చు. పొరపాటున గిన్నెల సందుల్లో కొద్ది పీచు ఇరుక్కున్నా సమస్యలు రావు. ఇప్పుడు స్టీల్ పీచుతో తోముకుంటున్నారు. మూకుళ్ళ హ్యాండిల్స్ వద్ద ఇరుక్కుంటే కూరల్లో పడిపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది. కొత్తగా ఎన్ని రకాల స్ర్కబ్బర్లు వచ్చినా కొబ్బరి పీచును దాటలేకపోయాయి. నేనివాళ కొబ్బరి పీచుతో అమ్మాయిని సృష్టించాను. నా చిన్నతనంలో కొబ్బరి చెట్టు వ్యర్ధాలతో పడవలు, పూలు, ఇళ్ళు, రకరకాల కళాఖండాలు మా నాన్న, అన్నయ్యలు సృష్టించేవారు. నేను కూడా చాలానే చేశాను. అమ్మాయి బొమ్మనైత ఇదే తొలిసారిగా చేస్తున్నాను. దీని శాస్త్రీయ నామం ‘‘కోకాస్ న్యూసిఫెరా’’. ఇది ‘‘పామే’’ కుటుంబానికి చెందిన ‘‘ఆరికేలిస్’’ క్రమానికి చెందింది. ఈ చెట్టు సుమారు 100 అడుగుల వరకు పెరుగుతుంది. ఏడు సంవత్సరాల వయస్సు నుంచీ పూతలు పూస్తూ, కాయలనిస్తూ ఉంటాయి. దీనిని ‘‘కల్ప వృక్షం’’ అంటారు.  కావలసిన ఆహారాన్ని, నిత్యావసర వస్తువుల్నీతలదాచుకునే చోటునీ ఇస్తుంది. పూజలలో, పెళ్ళిళ్లల్లో, శుభ కార్యాలలో కొబ్బరి ఆకులకు, కొబ్బరి కాయకు ప్రథమ స్థానం ఇస్తారు. కొబ్బరి బొండాంలోని నీళ్ళకు చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. ఈ నీళ్ళల్లో గ్లూకోజ్‌తో పాటు పోటాషియం, సోడియం లాంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరికాయలో నీరు, కండ, గట్టి పెంకు ఉంటాయి. ఈ నీళ్ళను నెలరోజులున్న శిశివుకు కూడా ఇవ్వవచ్చు. సులభంగా జీర్ణమవుతుంది. స్త్రీ పుష్పాలు ఆకుపచ్చ రంగులో, పురుష పుష్పాలు మీగడ రంగులో ఉంటాయి. కొబ్బరికాయను కొట్టడం ఆత్మ సమర్పణగా భావిస్తారు.
కొబ్బరి పీచును గుండ్రంగా చిన్నచిన్నవృత్తాలుగా చేశాను. వీటిని తల భాగంలో అమర్చాను. శరీరం, కాళ్ళు, చేతులు అమర్చాను. తలకు రింగుల జుట్టు పెట్టాము. కళ్ళు, ముక్కు, నోరుకు ఫ్లాస్టిక్ మూతల్ని పెట్టాను. షర్టుకు గుండీలు పెట్టాను. ఈ కోకిలకు జుట్టు బాగా రేగుతోంది. అయినా రింగుల జుట్టు కోకిల అందంగా ఉన్నది.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం