నేర్చుకుంది ప్రశ్నించడం
నాలో రగులుతున్న
కణ కణం రాయమంది పదునైన అక్షరం..
తట్టి లేపమంది తక్షణం మ(నిషిలో)నిదురించు
మానవత్వాన్ని ఈ క్షణం సాటివారికి
సాయం చేయని సమాజంలో బ్రతికేంటి ప్రయోజనం..?
తోటి మనిషి శోకం పంచుకోలేని హృదయం ఉండీ ఏం లాభం..?
తోటి మనిషిని మనిషిలా చూడలేని లోకంలో
ఎన్నాళ్లుండి ఏం సాధిస్తాం..?
అందం, ఆస్తి, అధికారపు,
అహంకారాలేవీ నీ తోడురా వెప్పటికీ..
కాటికి నిను మోసే నలుగురుని మంచితో
గెలుచుకో నీ జీవితపు చివరాఖరికి..
నవ్వుతూ పలకరించే పదిమంది ప్రేమని
ప్రేమతో సాధించుకో.. ఎందుకంటే
మరలి పోతే మళ్ళీ వస్తుందో రాదో తెలీదు ఈ గొప్ప మానవజన్మం..ఇదే
జగమెరిగిన జీవిత సత్యం.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి