కరచాలనాలు!
పరస్పర ఆలింగనాల,
సరి లాంఛనాలు !
మౌనప్రవచనాలు,
మనోసాంత్వనాలు!
పరస్పర విద్వేషాల ,
స్వస్తి వాక్యాలు!
వింత కరచాలనం,
కలియుగ నిదర్శనం!
ఓ చేయని మరో చేయి,
ఏం చేస్తుందో సందేహం!
కుందేలు కాలు ,పులి పంజా,
భయ సంబంధం!
ఘటోత్కచ హస్తం
ఉత్తరకుమార భయోత్పాతం!
చేతుల వేళ్ళు సున్నితంగా,
ఒకటవ్వాలి!
ఇరు హృదయాలను ,
సన్నితం చేయాలి !
చెలిమి కలిమి పాదుకు ,
నీరు పోయాలి!
బలిమి భావాలన్నీ ,
తుడిచి పెట్టాలి!
పూలకి కంటకాలు ,
ఆటంకాలు కావు !
కంటకాలు పూలకి ,
రక్షణ కవచాలు!
దుర్మార్గానికో అవకాశం,
సన్మార్గంతో సాహచర్యం !
సన్మార్గంతో చేరి దుర్మార్గం,
నేర్వాలి సాధు జీవనం!
మంచి స్నేహం,
చెడు ద్రోహం!
మంచి పెంచు ,
చెడు తలవంచు !
చెడు దౌర్జన్యం
మంచి సౌజన్యం;
మంచి వెలుగై విజయం,
చెడు చీకటి మాయం!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి