ధనాధనా దరువేస్తూ చక్కంగా పాడుతాను
మనసులోని భావాలను మెల్లగాను బయటపెడుతు
విన్నవారు మురిసేలా సవ్యంగా పాడుతాను
తేటతేట పదములతో తేనెబొట్లు చిందిస్తూ
గళమునెత్తి కోకిలలా కమ్మంగా పాడుతాను
లెమ్ము లెమ్ము లెమ్మంటూ వెన్నుతట్టి నిద్రలేపి
ఝుమ్ముఝుమ్ము ఝుమ్మంటూ రమ్యంగా పాడుతాను
జోజోజో జోయంటూ జవరంగా గళమునెత్తి
ఇంపుసొంపు లొలికిస్తూ సౌమ్యంగా పాడుతాను
ఉగ్గుపాలు తాగిస్తూ ఊపులూపి పసివారిని
ఊయలలో పండబెట్టి హృద్యంగా పాడుతాను
జాబిల్లిని చూపిస్తూ చల్లదనము అనుభవిస్తు
చిన్నారులను మురిపిస్తూ శ్రావ్యంగా పాడుతాను
తెలుగుతల్లి మహత్యాన్ని తిన్నగాను తెలియజేయ
అక్షరాలకు హారతిచ్చి అందంగా పాడుతాను
"రాజేంద్ర" రాగాన్నై రసగంగను పారిస్తూ
గుండెలలో నిలిచిపోయె గీతంగా పాడుతాను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి