జీవన్ముక్తి కి సోపానం జగన్నాథ రథయాత్ర : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.


 జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని
అమెరికాలో ఉన్నపుడు నాకూతురు అమ్మలమ్మ చెబితే 
అరవై ఏండ్లు దాటిన 
నా అర్ధాంగి 
ఇక్కడ  కూడా అన్ని సదుపాయాలుంటాయంటే
అలాగే తప్పక మీతో వస్తానని 
అరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న 
జగన్నాథుని గుడికి వెళ్ళితే 
ఎందరో దేశ విదేశీయులు
హరే రామ హరే కృష్ణ భక్తులు 
రంగు రంగుల 
అందమైన రథంలో బలభద్ర, శ్రీకృష్ణ సుభద్రలను  పెట్టి
వయస్సుచే పెద్దవాళ్ళమయినందున రమ్మనమని
నాచేత  గణపతి శ్లోకం చెప్పించి 
రథాన్ని  మొదట లాగమని స్వామి ఛత్రాన్ని పట్టుకోమంటే 
'జై జగన్నాథ' అని మూడుసార్లని 
రంగు రంగుల దుస్తులతో 
డోలు వాయిస్తు పెద్ద చిన్న 
మంత్ర పుష్ప హారతులిచ్చి
చక్కటి ప్రసాదం ఇస్తే 
ఏబై ఏండ్లు కాపురం చేసిన నా అర్ధాంగి 
ఇండియాలో కన్న ఇక్కడ రథయాత్ర బాగా జరిగిందంటే 
అవును ప్రసాదం కూడా చాలా రుచిగా ఉందంటే 
మీకెప్పుడు తిండి గోలే అనగా 
అందుకేగా ఆరోగ్యంగా జీవిస్తున్నా అని
జీవన్ముక్తి కి సోపానం  రథయాత్ర అన్నది అక్షర సత్యం..!!
................................
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం