బాల వ్యాకరణకర్త చిన్నయసూరి
 

పరవస్తు చిన్నయసూరి  సాహిత్య ఝరి అని, బాలవ్యాకరణ కర్త అని పరవస్తు చిన్నయసూరి సాహిత్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లూరి విజయ లక్ష్మణ్ అన్నారు. కొత్తూరు రచయితల వేదిక పదహారో నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితాలను ప్రతిబింబించే విధంగా ఆయన రచనలు చేసి, మానవాళిని నీతి నియమాలు వైపు పయనించేలా ప్రభావితం చేసారని అన్నారు. నీతి చంద్రికలు వంటి ఎన్నో గ్రంథాలను రచించి, కవన లోకానికి మణిహారంగా నిలిచారని అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ హార్మోనిస్ట్ పడాల కృష్ణారావు, గౌరవ అతిథిగా విచ్చేసి, వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించి సభాసదుల ప్రశంసలు పొందారు. కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ జరిగిన కవి సమ్మేళనంలో ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఎ.దిలీప్ పట్నాయక్,  కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, ఇప్పిలి జానకి రామయ్య, ఎస్.మన్మధరావు, కె.కృష్ణారావు, జి.మోహనరావు, పేడాడ గురుమూర్తి, బాణాల రమణమూర్తిలు తమ తమ కవితలను వినిపించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలుగు భాషోపాధ్యాయులు పేరిశెట్టి రామచంద్రరావు తదితరులు తమ తమ ప్రసంగాలలో ఆంధ్రజాతికి జీవం వంటి వాడుక భాషా ఔన్నత్యం, వ్యాకరణ అంశాలు, సామెతలు, పద్యాలలో గల విలువలను ప్రస్తావించారు. అనంతరం అతిథులకు ఆహ్వానితులకు కవులకు వేదిక సభ్యులు జ్ఞాపిక శాలువాలతో పాటు కొత్తూరు సాహితి సంకలనాలను బహూకరించి ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు