హలో పిల్లలూ ! రోడ్ల పక్కన ఎర్రటి పూలతో విరబూసి వచ్చే పోయే వారి దృష్టినంతా తమ వైపే తిప్పుకునే తురాయి చెట్టును చూశారా!. అన్నీ చోట్లా కనిపించే చెట్టు. అందరినీ ఆకర్షించే చెట్టు. మా పాత ఇంటి పెరట్లో పెద్ద తురాయి చెట్టున్నది. దాని క్రింద మా పిల్లలు, పేషెంట్ల పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. దీని శాస్త్రీయ నామం "డెలోనిక్స్ రీజియా". ఇది ఫాబేసి కుటుంబానికి, సిసాల్పినాయిడే ఉప కుటుంబానికి చెందిన చెట్టు. మా కాలేజీ గేటు ముందు ఉండేది. ఫాబేసి కుటుంబానికి ఉదాహరణగా ఈ చెట్టునే చూపించేవారు. పువ్వులు పెద్దవిగా ఉంటాయి. ఇది మధ్య తరహాగా ఆకురాల్చే చెట్టు. పూల రెక్కలు మూడు, నాలుగు అంగుళాల పొడవు ఉంటాయి. ఐదు రెక్కలు ఉంటాయి. పువ్వులు నారింజ, ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటాయి. మా ఇంట్లో ఉండే చెట్టు పూర్తి ఎరుపు రంగులో ఉంటుంది. ఒక కొమ్మకు 8 నుంచి 25 రెమ్మలు జతలుగా ఉంటాయి. ప్రతి రెమ్మకు 30 నుండి 60 దాకా ఆకులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో ఎక్కువగా పూస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి దాకా ఆకులు రాలిపోయి మోడుల్లా ఉంటాయి. ఏప్రిల్, మే నెలల్లో బాగా వికసిస్తాయి.
నూరు వరహాల పూల మొగ్గలతో తల, మొండెం, చేతులు తంయారు చేశాను. గౌను మాత్రం తురాయి పూలతోనే కుట్టాను. మధ్యలో కనకాంబరాలు వేసి డిజైన్ చేశాను. నూరు వరహాల మొగ్గలు తను బొమ్మలుగా, కనకాంబరాలు కళ్ళుగా పెట్టాను. నోరు కోసం ఎర్రని తురాయి పువ్వునే పెట్టాను. కనకాంబరాల లోలాకులు పెట్టుకున్నది. తల మీద కొప్పు పెట్టుకున్నది. జడ వేస్తానంటే ఒప్పుకోలేదు. కాళ్ళు కూడా నూరు వరహాల పూలే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి