నేర్చుకో తీర్చుకో అవసరాలు: - డా.సి.వసుధర-చెన్నై


క్షరము లేని అక్షరం 
చేరింది ఈనాటికి 
డిజిటల్  స్థితికి

లిపి, భాషను చేస్తుంది చిరంజీవిని. 

తాళ పత్ర, శిలాశాసనాల తామ్రపలకపై
రాజ్యమేలిన అక్షరం 
నేడు చేరింది బుల్లి పెట్టెలలోకి 
 
శ్రీకృష్ణుని నోట
ప్రపంచమంతా ఇమిడినట్లు 
నేటి అక్షరాల 
ఐశ్వర్యం 
డిజిటల్ ప్రపంచానికే సొంతం.
మంచి చెడు 
ఎప్పుడు చెరి సగం.
ఫోన్లో కంప్యూటర్లు కాస్త ఓ నిమిషంకళ్ళు
 మూసుకుంటే ప్రపంచ అవుతుంది తనకిందులు. 
ఇంటినుండి 
సర్వం సాధ్యం

మారిపోయింది ప్రపంచం 
మునిగిపోయే 
డిజిటల్ 
సముద్రంలో.
 

మంచిని మంచిగా కాక 
ముంచేయడానికే 
రెడీ
అందుకే మనం 
పాటించాలి భద్రం తెలుసుకోని 
 వాడుకో 
సైబర్ నేరగాళ్లు 
చెంతనే ఉంటారు 
తస్మాత్ జాగ్రత్త.
కామెంట్‌లు