నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నను "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ పురస్కారం వరించింది.ప్రతి ఏటా విద్యాప్రదాత,విశ్రాంత అధ్యాపకులు స్వర్గీయ శ్రీ ముప్పవరపు వెంకటేశ్వరావు, స్వర్గీయ శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి తల్లిదండ్రుల పేరిట యం. వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుమారుడు ఆ సంస్థ చైర్మన్ శ్రీ యం.లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి శ్రీమతి యం. విజయ లక్ష్మి దంపతులు గద్వాల సోమన్నను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.అచిర కాల వ్యవధిలో శతాధిక పుస్తకాలు(106) వ్రాసి ముద్రించిన విషయం అందరికీ విదితమే.బాలసాహిత్యంలో "బాల గేయ బ్రహ్మ" గద్వాల సోమన్న అవిరళ కృషికిగానూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యం. వి. రావు ఫౌండేషన్ అధినేత ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, పురస్కార గ్రహీత ఓ ప్రకటనలో తెలిపారు.ఆగస్టు 2,2026న ఈ పురస్కారం నెల్లూరులో అందజేస్తారు.ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎన్నికైన గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభిందించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ పురస్కారానికి గద్వాల సోమన్న ఎంపిక
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి