పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసియల్స్ & మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్ టీమ్ (ప్రాంప్ట్ ) సభ్యులు బుధవారం సమావేశమై పి.ఆర్. & మీడియా స్పోర్ట్స్ & కల్చరల్ మీట్ ను అక్టోబర్ నెలలో నిర్వహించాలని తీర్మానించారు. స్పోర్ట్స్ మీట్ లో వివిధ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా యూనిట్లతో బాటు పబ్లిక్ రిలేషన్స్ టీమ్స్ కూడా పాల్గొంటాయని ప్రాంప్ట్ ప్రెసిడెంట్ బి.హెచ్.ఇ.యల్. విశ్రాంత సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పి.యన్. భాను ప్రకాష్ తెలియజేసారు. క్రికెట్, షటిల్ బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటలలో పోటీలను నిర్వహించి గెలుపొందిన టీమ్ లతో బాటు పాల్గొన్న టీమ్ లకు కూడా మెమెంటో లను బహుకరిస్తారని, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమములో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని భాను ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రాంప్ట్ సలహాదారుడు, హెచ్.ఎం.టి. విశ్రాంత జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ కే.ఎం.కె. రావు, షేక్ షాజహాన్, న్యూస్ ప్రెజెoటర్ పోణంగి బాల భాస్కర్, ప్రాంప్ట్ వైస్ ప్రెసిడెంట్ ఏ. సాయిలు, జనరల్ సెక్రటరీ ఎస్. చక్రపాణి, జాయింట్ సెక్రటరీ ఏ.వెంకట్ రావు, రామ్, శివ శంకర్, రవి అనుపాల భాను చెందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముందు ప్రాంప్ట్ జాయింట్ సెక్రటరీ ఏ. వెంకట్ రావు ఆహ్వానించగా, చివరిలో ప్రాంప్ట్ జనరల్ సెక్రటరీ చక్రపాణి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.
**
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి