ఢిల్లీ ఆంధ్రభవన్‌లో 'జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కారం' ప్రదానం*
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపన్యాసకులు సింగారం గ్రామవాసి రచయిత, బాల సాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములుకు తెలుగు భాష, బాలసాహిత్యానికి చేస్తున్న కృషికి గాను జాతీయ స్థాయి గౌరవం దక్కింది.
జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో * జూలై 29న ఢిల్లీలోని* ఆంధ్రభవన్‌లో నిర్వహించిన ' తెలుగు వెలుగు సంబరాలు-2026'_సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలు కార్యక్రమంలో ఆయనకు ప్రత్యేక ఆహ్వానంతో పాటు _'జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కారం' అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు గనుల మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , పార్లమెంటు సభ్యులు ,బంగారు లక్ష్మణ్, బీద మస్తాన్ రావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి లు, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవచనకర్త ఆకెళ్ళ విభీషణ శర్మ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రొఫెసర్ జగదీశ్వర్,డిల్లీ యూనివర్సిటీ ఆచార్యులు అట్టెం దత్తయ్య, తెలంగాణ మాజీ బిసి కమీషనర్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ ,జాతీయ సారస్వత పరిషత్ కార్యనిర్వహక అధ్యక్షులు కేశిరాజు రాంప్రసాద్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, డా .ఎస్.ఆదినారాయణ, తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాభ్ ,ఉద్దంరాజు, చాన్సిలర్ చైతన్య రాజు, సినీ నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి ,చెరుకు మహేశ్వర శర్మ,కామని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి