వెరికోజ్ వీన్స్: - - యామిజాల జగదీశ్
 
వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌ వారిలో కాళ్లు, పాదాల్లో ఉండే ర‌క్త‌నాళాలు ఉబ్బిపోయి క‌నిపిస్తా యి.  ఇది అంద‌రికీ తెలిసిందే. అయితే అవి నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో నాళాలు వంక‌ర్లు తిరిగిపోతాయి కూడా. దీని వ‌ల్ల రక్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో కాళ్ల‌లో నొప్పులు వ‌స్తాయి. భారంగా అనిపిస్తాయి. 
అయితే వెరికోజ్ వీన్స్ వ‌చ్చేందుకు మాత్రం అనేక కార‌ణాలు ఉంటాయి.
కాళ్లు లేదా జీర్ణాశ‌యంపై అధికంగా ఒత్తిడి ప‌డినా, మ‌హిళ‌లు గ‌ర్భంతో ఉన్న సమ‌యంలో,   స్థూల‌ కాయం, తీవ్ర‌మైన మ‌ల‌బ‌ ద్ద‌కం, ట్యూమ‌ర్లు ఏర్ప‌డ‌ డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం వంటి అనేక కార‌ణాలు వెరికోజ్ వీన్స్‌ కు దారి తీస్తాయి. 
అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారు డాక్ట‌రుని సంప్రదించి త‌గిన చికిత్స తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.  
వెరికోజ్ వీన్స్ వ‌చ్చిన వారు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసుకుందాం.....
వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయాలి. గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌కుండా చూసుకోవాలి. అలా కూర్చోవాల్సి వ‌స్తే మ‌ధ్య మ‌ధ్య‌లో లేచి కొంత సేపు న‌డుస్తుండాలి. మ‌సాజ్ ఆయిల్స్ తో నిత్యం కాళ్ల‌ను,   పాదాల‌ను సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. అధికంగా ఒత్తిడి ప‌డ‌కుండా సుతారంగా మ‌ర్ద‌నా చేయాలి. ర‌క్త స‌ర‌ఫరా పెరిగేందుకు కాళ్ల‌ను పైకి ఉంచాలి. ముఖ్యంగా నిద్రించే స‌మ‌యంలో ఇలా చేయాలి. 
ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ్గా ఉండేందుకు వ‌దులైన దుస్తుల‌ను ధ‌రించాలి. బిగుతుగా ఉన్న వ‌స్త్రాల‌ను ధ‌రించ‌రాదు. వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు ఆయుర్వేద మందుల‌ను ఉప‌యోగిస్తే ఫ‌లితం ఉంటుంది. ఫ్లేవ‌నాయిడ్స్ ఎక్కువ‌గా ఉండే ఉల్లిపాయ‌ లు, క్యాప్సికం, పాల‌కూర‌, ద్రాక్ష‌ లు, చెర్రీలు, యాపిల్స్‌, బ్లూబెర్రీలు, వెల్లుల్లి త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. పొటాషియం ఎక్కువ‌గా ఉండే బాదం ప‌ప్పు, పిస్తాలు, ప‌ప్పు దినుసులు, ఆలుగ‌డ్డ‌లు, ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, చేపలు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే న‌ట్స్‌, సీడ్స్‌, ఓట్స్‌, అవిసెలు, తృణ ధాన్యాలు త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే వెరికోజ్ వీన్స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం