మనుమరాలు ముచ్చట్లు: - చెన్నమనేని ప్రేమసాగర్ రావు


మనుమరాలు అలిగింది 
ఏడుస్తూ కూర్చుంది 
నేను దగ్గరకు తీసుకొని
ఏడవకు తల్లీ నీకుఏమికావాలి
అని అడిగినాను 
అమ్మను వందరూపాయలు అడిగాను కోప్పడ్డది 
సరేతల్లీ నేనుఇస్తననిచెప్పినాను 
సమయానికి జేబులో డబ్బులేదు 
నాబిడ్డనుపిలిచిడబ్బు
ఇమ్మన్నాను,దానిపర్సులో 
65 రూపాయలున్నవి 
మొత్తముతీసి ఇచ్చింది 
అలుకతీరింది బయటకెల్లింది 
కొన్నివస్తువులు తెచ్చుకుంది 
అవిసర్దుకుంటూ తనలో తనే 
మాట్లాడుకుంటుంది 
ప్రతిశుక్రవారం నాస్నేహితులు 
నాకు ఒకబహుమతి ఇస్తారు 
నేను వాళ్ళందరికీ ఈరోజు 
మంచిబహుమతులు ఇవ్వాలి
అనుకుంటూ సర్దుకుంటుంది 
ఎంతగొప్ప ఆలోచన 
పసిహృదయంలో
ఎంతఆత్మీయత 
వంద ఇచ్చేదుండె నాజేబులో 
లేకపాయెనే అనుకుంటు 
ప్యాంటుజేబులో చేయిపెట్టుకున్న 
నోట్లుచేతికితగిలినవి 
అయ్యో చూసుకోకపోతినే 
చూసుకుంటే అదిఅడిగిన 
వందరూపాయలు ఇచ్చేవాన్ని
కదాఅనుకొని బాధపడ్డాను ,
ఇంతలో కలచెదిరి పోయింది 
,మెలుకువ  వచ్చింది 
 
కామెంట్‌లు