అమ్మ అలిగిన వేళ: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-సెయింట్ లూయిస్- యు. ఎస్.ఎ.


 ఆరుగురు పిల్లలతో
అలుపెరుగని జీవితంతో
ఆప్యాయతగా మమ్మల్ని పెంచి
అనురాగాన్ని అందరికి పంచి
అమ్మమ్మకు కూతురైన,కొడుకైన తానే అని ఆదరించి
ఆఖరి వరకు జన్మనిచ్చిన తల్లి ఋణం తీర్చుకున్న
అమ్మ ఎందుకో అలిగిందని
అనకాపల్లిలోని అమ్మలక్క చెబితే
ఆదుర్దగా ఆదిలాబాద్ నుంచి బయలు దేరా
అమ్మ నన్ను చూసి మూతి ముడుచుకున్నా
ఆప్యాయతగా అమ్మా అనిపిలచి
అసలు విషయం అడిగినపుడు
ఆశ్చర్యపోయాను 
అలహాబాద్  నుంచి అన్నయ్య
అనకాపల్లి  పెద్ద పండుగకు రానన్నాడని
అపుడు అమ్మతో చెప్పా 
అందరు వేసవిలో కలసినపుడు 
అదే సంక్రాంతి అని 
అన్నతో  వీడియో కాల్ చేయిస్తే
అలిగిన అరవై ఏళ్ళు దాటిన
అమ్మ ఆనందంగా అమ్మలక్కతో
అన్నం పెట్టు చెల్లి అరుణమ్మకు నాకు అని అంది.
అమ్మ  కలిగిన వారు
అదృష్టవంతులే అనుకున్నా.......!!
...............................
కామెంట్‌లు