కృష్ణుడు: - - యామిజాల జగదీశ్


 పరమేశ్వరుడిగా వెలిగే ఆ కృష్ణుడు... భక్తుల మనసు దోచే ఆ కృష్ణుడు... 
వేదాలకు పరబ్రహ్మం.
యోగులకు పరమాత్మ.
జ్ఞానులకు సాటిలేని సత్యం.
ఇప్పుడు...
ఆయనను నమ్ముకున్న భక్తులకు మాత్రం హృదయాన్ని మధురంగా ​​దోచుకునే, చిరునవ్వుతో లోకాన్ని వశం చేసుకునే కృష్ణుడు... 
ఆయన నామాన్ని ఒక్కసారి తలిస్తే చాలు, మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఆయన రూపాన్ని ఒక్కసారి చూస్తే చాలు కళ్లు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లుతాయి.
ఆయన కరుణను ఒక్కసారి పొందితే చాలు, జీవితమంతా భక్తి భావంతో వికసిస్తుంది.
కామెంట్‌లు