జాతీయ స్థాయి బహుమతి పొందిన రిషిక




 గంభీరావుపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేటలో 10వ తరగతి చదువుతున్న పర్షకుర్మ రిషిక ఉషాబాల పత్రిక వారు నిర్వహించిన జాతీయ స్థాయి పిల్లల కోసం పిల్లలు రాసిన కథల పోటీకి పట్టుదల అనే శీర్షికతో కథను రాసింది.పిల్లలు పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ విద్యార్థి జీవితాన్ని అద్భుతంగా కథ రూపంలో రాసి బహుమతి పొందినది. బహుమతి పొందిన రిషికను తెలుగు ఉపాధ్యాయులు రాజయ్య, నరేందర్ లు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంటి గంగారాం గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందిచారు.
కామెంట్‌లు