సతీ సహగమనం!: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 

డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
బొబ్బిలి 1757లో బుస్సీ  చేతిలో నాశనం అవ్వటంతో నాటి ఆత్మాభిమానం గల రాచకన్నెలు సతీసహగమనం చేశారు 1734లో పెద్దాపురంలో తిమ్మ అనే జమీందారు చనిపోవడంతో అతని తల్లి రంగమ్మ చితిని ఏర్పాటు చేసి మిగతా స్త్రీలతో కలిసి అందులో దూకి భస్మం అయింది అతనితో పోరిన వాడు రుస్తుంఖాన్ వాడి చేతిలో అవమానం పాలు కాకూడదు అని స్త్రీలంతా మంటకు ఆహుతి అయ్యారు ఆనంద గజపతి తో యుద్ధం చేస్తూ భర్త చనిపోవడంతో 1760లో సీతమ్మ మంటలో దూకి అగ్నికి ఆహుతి అయింది ఆనందగజపతి ఇద్దరు భార్యలు అతను రాజమండ్రిలో చనిపోవడంతో సతీసహగమనం చేశారు నూజివీడు సంస్థానంలో కూడా ఈ పద్ధతిని పాటించారు రాజా నరసింహ అప్పారావు అతని వారసుడు శోభనాద్రి అప్పారావు చనిపోయినప్పుడు వారి భార్యలు మంటలు దూకారు 1771లో సీతమ్మ వెంకటాద్రి అప్పారావు భార్య సతిగా మారింది 1789లో నరసింహ అప్పారావు చనిపోయినప్పుడు యూరోపియన్ ఆఫీసరు చేసిన అవమానంతో ఆమె చితిలో దూకింది 1822లో తూము పాపయ్య భార్య అతను చనిపోవడంతో గుంటూరులో సతీసహగమనం చేసింది దీనిని వెన్నెలకంటి సుబ్బారావు గారు తన జర్నల్లో రాశారు స్వయంగా చూశారు .అచ్చాయమ్మ  అనే వితంతువు అలాగే ప్రాణాలు తీసుకుంది కాశీ యాత్ర చరిత్రలో వీరాస్వామి దీని ప్రస్తావన చేశారు జమీందారులు రాజకుటుంబీకులు ఇలా సతీసహగమనం చేశారు.ఇది సామాన్య జనులు పాటించిన దాఖలాలు లేవు.ఇక బాలవితంతువుల స్థితి వర్ణనాతీతం.బతికున్నందుకు పీక్కుతినేరాక్షసులు ఇంట్లోవారు.అపవిత్రురాలిగా ఒంటిపూట భోజనం,ఇంటింటికీ  చాకిరీ,అంచులేని తెల్లచీర  నెత్తికి గుండు,ముసుగు,మడి తడిబట్టలతో వంటావార్పు ఆవితంతువు  జీవితం.తల్లి వదినె మరదలు అక్క చెల్లెళ్ల పురుడుపుణ్యాలతో  ఆమె బతుకు తెల్లవారేది. తొలి వితంతువివాహం 1881లో రాజమండ్రీలో  గోగులపాటి శ్రీరాములు గవరమ్మ కి ,రెండవది రత్నమ్మ  రామచంద్రరావుకి 4రోజుల వ్యవధిలో జరగటం ఓవిశేషం!1884లోసొసైటీ ఆఫ్ విడో మ్యారేజ్ ఆరంభించబడింది.కందుకూరి వీరేశలింగంపంతులుగారి తర్వాత  చిలకమర్తి  లక్ష్మీనరసింహంగారు ఉన్నవ వారు  చేసిన కృషి అమోఘం!16వశతాబ్దిలో ప్రారంభమైన దేవదాసి ఆచారం 19వశతాబ్దం దాకా సాగి ఎన్నో సంసారాలు కుప్పకూలాయి. పండిట్ మదన్మోహన్ మాలవ్యా తీవ్రంగా దుయ్యబట్టారు.ఆంధ్రదేశంలో కందుకూరివారు,రఘుపతివెంకటరత్నం నాయుడు,ఆపై దర్శి చెంచయ్య కృషితో1937,1947 బిల్లుపాసైంది. దాని కారకులు అమ్మన్నరాజా, ముత్తులక్ష్మీ రెడ్డి🌹
కామెంట్‌లు