ఇంటిల్లిపాదీ మురిసేరోజు
ముస్తాబుచేసి ఫోటో అంటే
పాపాయి పెట్టే చక్కని ఫోజు!!
ఉడుతలు చిలుకలు వచ్చాయి
జామపండ్లెన్నో తెచ్చాయి
కుందేళ్ళు క్యారెట్ దుంపలు
తలొకటి తీసుకు తిన్నాయి!!
మల్లెలు గులాబీ చామంతి
మాపాప బుగ్గల పూబంతి
మెరిసే కళ్ళకు కాటుకతో
అమ్మా నాన్నతో మాటామంతీ!!
సీతాకోకా చిలుకమ్మా
మాతోటకి ఇపుడే వచ్చిందమ్మా
నవ్వుల పువ్వులపై వాలి
నెమలిని హంసనీ పిల్చిందమ్మా!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి