మరికొందరి తీరు మరో వింత!
మోసం చేయాలని కొందరు...
నవ్వుతూ నటిస్తూ జీవితాన్ని
గడిపేస్తుండే కొందరి మనస్తత్వం!
నేనేంటి నాకేంటి అంటూ గొప్పలు చెప్పుకుంటూ,
తమ తప్పులను నవ్వుల నటనలతోటి
కప్పేసుకునే తత్వాలు మరికొందరివి!
నేటి రోజులు కొద్దో గొప్పో బాగున్నాయి అంటే....
ఎదుటివారికి సాయంచేస్తూ,
లేనిదానికోసం ఆరాటపడకుండా,
ఎదుటివారిపై మాట జారకుండా,
ఇచ్చిన మాట తప్పకుండా....
తన మనసులోని మంచితనాన్ని
పంచుకుంటూ, బంధాలను కలుపుకుంటూ,
తోటివారిపట్ల గౌరవభావం కలిగి ఉంటూ!
తన గౌరవాన్ని పెంచుకుంటూ
పోయేవాడు... తన ఆనందమే
కాకుండా సమాజపు ఆనందాన్ని కూడా
కోరుకునే తత్వం కలిగి ఉన్న మనుషులు,
నేటి సమాజంలో అరుదుగా కనిపిస్తుంటారు!
నిజంగా మనిషిని మహాత్ముని చేసేది.....
సమాజపు గుండెల్లో గూడుకట్టుకుని ఉండేది...
మంచిని పంచే గొప్ప మనసు కలిగి ఉండటం! అదే మనిషికి
ఉండాల్సిన కచ్చితత్వం, మంచి తత్వం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి