సాగరానికి సాటి వుందా
అంతర్యామికి పోలిక వుందా
వేకువను మించిన అద్భుతం వుందా?
చీకటి తెరలను జరిపేసి
చిక్కగ వెలుగులు పంచేసి
చక్కగ ప్రకృతి మురిసేలా
సడి చేయక సంబరం తెస్తూ....
అవనికి చైతన్యమిచ్చి
భువిని దివిగా మార్చి
నవనవోన్మేష సొబగులిచ్చే
రవిని మించిన దైవముందా?
ఆశను ఆర్తిగా మార్చి
అభిలాషలు తీర్చుకునే
ఆరాటపు పరుగులు నేర్పి
అభివృద్ధి పధము చూపి....
అనునిత్యము ఆగమించి
అనుక్షణము గమనించి
అహర్నిశము అనునయించి
అందరినీ అనుగ్రహించే...
ఆదిత్యుని రాకతో
అర్ణవమైన ఆనందంలో
వర్ణమయమైన ఆకాశానికి
స్వర్ణ కాంతుల మెరిసే ధరణికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి